తెలంగాణ

telangana

ETV Bharat / state

దాశరథి అవార్డు గ్రహీత తిరునగరికి నివాళులు - దాశరథి అవార్డు గ్రహీత తిరునగరికి నివాళులు

దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్యకి మోత్కూర్​ మున్సిపాలిటీ కేంద్రంలోని శాఖ గ్రంథాయంలో నివాళులు అర్పించారు. ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని ఛైర్మన్​ కోమటి మత్స్యగిరి అన్నారు.

Tributes to Dasarathy Award recipient Thirunagari
Tributes to Dasarathy Award recipient Thirunagari

By

Published : Apr 26, 2021, 1:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మున్సిపాలిటీ కేంద్రంలోని శాఖ గ్రంథాయంలో తిరునగరి రామానుజయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్​ కోమటి మత్స్యగిరి పాల్గొన్నారు. మోత్కూర్​ శాఖ గ్రంథాలయానికి తిరునగరి 400 పుస్తకాలు అందజేశారని పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి సాహిత్య రంగంలో సూచనలు అందించి కవులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. త్వరలోనే మోత్కూర్ గ్రంథాలయానికి వచ్చి మరో 200 పుస్తకాలు అందజేస్తానన్నారని ఇంతలోనే అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లడం అత్యంత బాధాకరమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details