తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీలకు అతీతంగా మోత్కూరును ఆదరించారు - యాదాద్రి జిల్లా మోత్కూరు

యాదాద్రి జిల్లా మోత్కూరులో మాజీ కేంద్ర మంత్రి జైపాల్​ రెడ్డి చిత్ర పటానికి కాంగ్రెస్​ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్టీలకు అతీతంగా మోత్కురు ప్రజలను ఆదరించారని కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.

పార్టీలకు అతీతంగా మోత్కూరును ఆదరించారు

By

Published : Jul 29, 2019, 10:54 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో రాజకీయ దురంధురుడు, ఉత్తమ పార్లమెంట్ మెంబర్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్ర పటానికి కాంగ్రెస్​ నాయకులు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. గతంలో మిర్యాలగూడ పార్లమెంట్​ నియోజకవర్గం ఎంపీగా ఉన్నపుడు మోత్కూరు ప్రజలను ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేశారని.. అప్పటి విషయాలను నాయకులు స్మరించుకున్నా‌రు.

పార్టీలకు అతీతంగా మోత్కూరును ఆదరించారు

ABOUT THE AUTHOR

...view details