వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, సెక్టార్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు భువనగిరి పట్టణ శివారులోని వెన్నెల కళాశాలలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. నిబంధనలు పాటించాలని కలెక్టర్ అన్నారు. సిబ్బందికి విలువైన సూచనలు అందించారు. భువనగిరి డివిజన్లో 34, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 38,367 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.