యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ కలెక్టర్ గరీమ అగర్వాల్ సమీక్ష నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్, సెక్రటరీలతో.. పల్లె ప్రగతి పనులు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్, కంపోస్టు షెడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలపై ఆరా తీశారు. ఆ పనులన్ని వెంటనే పూర్తి చేయుటకు తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.
అభివృద్ధి పనులపై శిక్షణ కలెక్టర్ సమీక్ష - యాదగిరి గుట్ట మండలంలోని అభివృద్ధి పనులపై ఆరా
యాదగిరిగుట్ట మండల పరిధిలోని పల్లె ప్రగతి పనులు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ తదితర పనులను శిక్షణ కలెక్టర్ గరీమ అగర్వాల్ సమీక్షించారు. పనులన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన సర్పంచ్, సెక్రటరీలకు ప్రశంస పత్రాలు అందజేశారు.

అభివృద్ధి పనులపై శిక్షణ కలెక్టర్ సమీక్ష
అలాగే మండల పరిధిలోని గ్రామాల్లో అన్ని పనులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన మైలార్ గూడెం, కంపోస్ట్ పనులు ప్రారంభించిన.. మహబూబ్ పేట గ్రామాల సర్పంచ్, సెక్రటరీలకు ప్రశంస పత్రాలు అందజేశారు. గరీమ అగర్వాల్ ప్రస్తుతం యాదగిరిగుట్ట ఇంఛార్జ్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:పెద్దకందుకూర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన శిక్షణ కలెక్టర్