ధరణి పోర్టల్ ఇంటింటికి ఆస్తుల సర్వేను సకాలంలో పూర్తి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం, సైదాపురం, వంగపల్లి గ్రామాల్లో ఇంటింటి సర్వేని పరిశీలించి తగు సూచనలు చేశారు. రైతు వేదికల ప్రగతిని సమీక్షించారు.
అనుమానాలు నివృత్తి
ధరణి సర్వేపై అనుమానాలు ఉన్నవారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేయాలని అధికారులకు చెప్పారు. వివరాలు నమోదు చేసుకునేందుకు వస్తున్న సర్వే బృందాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు.