యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిధిలోని పెద్దకందుకూర్ గ్రామంలో శిక్షణ కలెక్టర్ గరీమా అగర్వాల్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాన్ని, హరితహారం, మొక్కల పెంపకం తదితర వివరాలు అడిగి తెలసుకున్నారు.
పెద్దకందుకూర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన శిక్షణ కలెక్టర్ - garima agarwal inspecting development works
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిధిలోని పెద్దకందుకూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శిక్షణ కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. మరింత నాణ్యతతో పనులు చేపట్టాలని గరీమా సూచించారు.

పెద్దకందుకూర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన శిక్షణ కలెక్టర్
పెద్దకందుకూర్లో నిర్మితమవుతున్న శ్మశాన వాటిక, డంపింగ్ యార్డును గరీమా పరిశీలించారు. గ్రామంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై గరీమా అధికారులకు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా.. మెరుగైన నాణ్యతతో నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చదవండిఃదివీస్ నుంచి కొవిడ్-19 ఔషధాల తయారీ విధానాల అభివృద్ధి
TAGGED:
గరీమా అగర్వాల్ పర్యటన