యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బెంగళూర్‌కు చెందిన లైటింగ్ టెక్నాలజీ బృందం సందర్శించింది. విద్యుత్ వెలుగులతో యాదాద్రి సన్నిధిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించనుంది. బాలాలయం, రాజగోపురం, అష్టబుజి, ప్రాకారాలు, ప్రధాన ఆలయము వంటి పలు చోట్ల విద్యుత్ దీపాలతో ట్రయల్‌రన్ నిర్వహించింది. ఆర్కిటెక్ ఆనంద్‌సాయి పలు సూచనలు చేశారు. యాడ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ వెలుగుల యాదాద్రికి ప్రణాళికలు.. ట్రయల్‌రన్ - yadadri
యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆర్కిటెక్ ఆనంత్సాయి ఆధ్వర్యంలో బాలాలయం, రాజగోపురం, అష్టబుజి, ప్రాకారాలు, ప్రధాన ఆలయాల్లో ట్రయల్‌రన్ నిర్వహించారు.
విద్యుత్ వెలుగుల యాదాద్రికి ప్రణాళికలు.. ట్రయల్‌రన్