హైదరాబాద్-విజయవాడ మార్గంలో నిలిచిన రాకపోకలు - National highway traffic jam news
![హైదరాబాద్-విజయవాడ మార్గంలో నిలిచిన రాకపోకలు ట్రాఫిక్ జామ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13915879-1025-13915879-1639573551971.jpg)
18:26 December 15
దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతుల వల్ల ట్రాఫిక్ జామ్
NH-65 Traffic Jam: హైదరాబాద్-విజయవాడ మార్గంలో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్ దండుమల్కాపురం వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి. దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతుల వల్ల ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జాతీయరహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా... ట్రాఫిక్‌లో రెండు అంబులెన్సులు చిక్కుకుపోయాయి. ట్రాఫిక్‌ను ఒకవైపు నుంచి మళ్లిస్తుండగా 2 చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మల్కాపూర్ వద్ద ఎదురెదురుగా వస్తూ రెండు కార్లు ఢీకొన్నాయి. తూప్రాన్ వద్ద ఎదురెదురుగా వస్తూ మరో చోట రెండు కార్లు ఢీకొన్నాయి. ఇప్పటివరకు ట్రాఫిక్‌ను ఎన్‌హెచ్ అధికారులు క్రమబద్ధీకరించలేదు. ఎన్‌హెచ్ అధికారుల వైఖరిపై వాహనదారుల మండిపడుతున్నారు. తొందరగా ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:ఎల్లుండి పార్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ