తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మారు హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ విధించనున్నారనే వార్తల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. మరోమారు లాక్డౌన్ విధిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో జీహెచ్ఎంసీ పరిధిలో స్థిరపడిన ప్రజలు సొంత ఊర్లకు పయనమవుతున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనబారులు - traffic jam at gudur toll plaza in yadadr district
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో మరోమారు లాక్డౌన్ విధిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ప్రజలు సొంత ఊర్లకు పయనమవుతున్నారు.
గూడురు టోల్‌ప్లాజా వద్ద వాహనదారులతో ట్రాఫిక్ జాం
ఇలా సొంతూర్లకు వెళ్లే ప్రజల వల్ల హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న గూడూరు వద్ద రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు నేరుగా వెళ్తున్నప్పటికీ డబ్బులు చెల్లించి వెళ్లే వాహనదారులు వరుసలో వేచి చూడాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ వైపు మొగ్గు చూపితే.. సాయంత్రానికి వాహనాలు రద్దీ మరింత పెరిగే అవకాశముందని టోల్ సిబ్బంది భావిస్తున్నారు.
Last Updated : Jul 1, 2020, 1:19 PM IST