తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో జల సవ్వడి... వడపర్తి కత్వలో పర్యటకుల సందడి - Vadaparthi Katwa Flows

భువనగిరి చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. దీనితో వడపర్తి కత్వ వద్ద పర్యటకుల సందడి నెలకొంది. వరద పరవళ్లు తొక్కి జలపాతాన్ని తలపిస్తోంది. ఇక్కడకు విచ్చేస్తున్న సందర్శకులను కనువిందు చేస్తుంది.

Tourists visit Vadaparthi Katwa, yadadri bhongir district
భువనగిరి చెరువులకు నీరు వచ్చే.. వడపర్తి కత్వకు పర్యాటకుల సందడి

By

Published : Oct 5, 2020, 3:06 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి కత్వ వద్ద పర్యటకుల సందడి నెలకొంది. వరద తగ్గినప్పటికీ ఆదివారం కావడం వల్ల సందర్శకులు భారీగా వచ్చారు. భువనగిరి చెరువులకు నీరు వచ్చే.. వడపర్తి కత్వ నుంచి నీలు జాలువారుతూ.. జలపాతాన్ని తలపిస్తోంది. సందర్శకులను కనువిందు చేస్తోంది.

కాళేశ్వరం జలాలతో బొమ్మలరామారం మండలం సోలిపేట చెరువు నిండి గొలుసుకట్టు చెరువులు నిండటం... ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో కొన్ని రోజులుగా వడపర్తి కత్వ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. జలపాతంలో పర్యటకులు జలకాలాడుతూ సందడి చేస్తున్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. వడపర్తి పరిసర ప్రాంత ప్రజలు కుటుంబ సభ్యులతో, పిల్లలతో వచ్చి పొంగిర్లుతున్న నీటిని చూసి తన్మయత్వం చెందుతున్నారు. వడపర్తి కత్వ వద్ద ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతం అవుతుందని పర్యటకులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details