యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్టలో కొవిడ్ నియంత్రణ కోసం దేవాదాయశాఖ యాదాద్రీశుడి దైవ దర్శనాలను మూడు రోజుల పాటు నిలిపివేతకు అనుమతించిన విషయం తెలిసిందే. కాలపరిమితి శుక్రవారం నాటికి ముగియడంతో శనివారం నుంచి ఉచిత లఘు దర్శనాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
యాదాద్రి దర్శనాలు పునఃప్రారంభం.. తరలివస్తున్న భక్తజనం - kcr visit updates
మూడు రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన అనంతరం... నేటి నుంచి యాదాద్రిలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఆదివారం సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
GUTTA
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిని సందర్శించనున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో యాదాద్రి వచ్చిన కేసీఆర్ తరువాత మళ్లీ ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం.
ఇదీ చూడండి: కొత్త జంటకు కోతి దీవెన.. అదేంటి..!?
Last Updated : Sep 12, 2020, 10:09 AM IST