తాటిచెట్టు నుంచి జారిపడి.. గీతకార్మికుడు మృతి - Toddy Topper Died Accidentally Slipped the Tree
కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కుతూ.. ప్రమాదవశాత్తు జారిపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.

తాటిచెట్టు నుంచి జారిపడి.. గీతకార్మికుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు నోముల నర్సయ్య (55) వృత్తి రీత్యా కల్లు గీత కార్మికుడు. కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతూ.. మధ్యలోనే ప్రమాద వశాత్తు జారిపడి.. ప్రాణాలు కోల్పోయాడు. చెట్టు పైనుంచి కింద పడిన నర్సయ్యను మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకురాగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.