కరోనా కట్టడికి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొంతమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌళ్లరామారం గ్రామానికి చెందిన దేవంజి గౌడ్.. తన వద్దకు వచ్చే కల్లు ప్రియుల నుంచి సామాజిక దూరాన్ని పాటించేందుకు ఆరడుగుల ప్లాస్టిక్ట్ పైపు ఉపయోగిస్తున్నాడు.
బాధ్యతగా కల్లుతాగడమంటే ఇదేనేమో..
అసలే కరోనా కాలం.. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. కల్లు తాగే అలవాటున్న నాలుక ఉరుకే కూర్చోనిస్తుందా... చెట్టు వెతుక్కుంటూ పొలాల బాట పట్టిస్తుంది. కరోనా పరిస్థితుల వల్ల సామాజిక దూరం పాటించాలని అధికారుల చెబుతున్నందున ఓ గౌడన్న వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టాడు. అదేలా అంటారా మీరే చూడండి.
బాధ్యతగా కల్లుతాగడమంటే ఇదేనేమో..
సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో మొదట్లో తాటివనంలో దూరంగా ముగ్గుతో డబ్బాలు గీశాడు. అయినా కల్లు పోసే సమయంలో దూరం తగ్గుతుందన్న విషయాన్ని గ్రహించిన దేవంజి గౌడ్... ఇలా ప్లాస్టిక్ పైపును వాడుతున్నాడు. తనలాగే ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నాడు. దేవంజి గౌడ్ అనుసరిస్తున్న తీరును గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Last Updated : Mar 29, 2020, 6:51 AM IST