తెలంగాణ

telangana

ETV Bharat / state

వటపత్రసాయి అలంకరణలో యాదాద్రీశుడు

యాదాద్రిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు వటపత్రసాయి అలంకరణలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చారు. వజ్ర వైడూర్యాలతో అలంకార సేవపై చూడముచ్చటగా పుష్పాలతో తీర్చిదిద్దారు.

Today Vatapatrasai is a model in decoration
వటపత్రసాయి అలంకరణలో యాదాద్రీశుడు

By

Published : Dec 29, 2020, 6:57 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు వటపత్రసాయి అలంకరణలో బాలాలయంలో సేవపై విహరిస్తూ భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు.

స్వామిని వటపత్రసాయి అలంకారంలో నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో చూడముచ్చటగా పలు రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య వేదపారాయణాలు, దివ్య ప్రబంధ పూజలతో ఐదోరోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవంగా జరిగాయి. వటపత్రసాయి అవతార విశిష్టతను అర్చకులు తెలిపారు.

ఈనెల 25వన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 30వ వరకు జరగనున్నాయి. అధ్యయణోత్సవాలు జరిగే ఆరు రోజులు మొక్కు కల్యాణం, శాశ్వత కల్యాణం, సుదర్శన నరసింహ హోమం సేవలు రద్దు చేశాం.

-గీతా రెడ్డి, ఆలయ ఈఓ

ఇదీ చూడండి:కనువిందుగా యాదాద్రి ఆలయనగరి డ్రోన్​ చిత్రాలు

ABOUT THE AUTHOR

...view details