యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అఖండ-నామ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ ప్రసన్న కృష్ణ దాస్ ప్రభూజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షయ సువర్ణలక్ష్మీ నారాయణ మహాయజ్ఞం ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 17వ తేదీన ప్రారంభమైన అక్షయ సువర్ణలక్ష్మీ నారాయణ మహాయజ్ఞాన్ని 28 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రోజు అశ్వరథ యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం, అక్షయ సువర్ణ లక్ష్మీ నారాయణ హావనము, పూర్ణాహుతులతో యజ్ఞాన్ని ముగించారు.
యాదాద్రిలో ముగిసిన అక్షయ సువర్ణలక్ష్మీ నారాయణ మహాయజ్ఞం - నేటితో ముగిసిన అక్షయ సువర్ణలక్ష్మీ నారాయణ మహాయజ్ఞం
యాదగిరిగుట్టలో గత 28 రోజులుగా అఖండ-నామ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ ప్రసన్న కృష్ణ దాస్ ప్రభూజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షయ సువర్ణ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం ఘనంగా ముగిసింది.
నేటితో ముగిసిన అక్షయ సువర్ణ లక్ష్మీ నారాయణ యజ్ఞం
భారత, వాయు, నావికా సేనల అభివృద్ధి, విజయాల కోసం, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకే ఈ యజ్ఞం నిర్వహించినట్లు పీఠాధిపతి శ్రీశ్రీ ప్రసన్న కృష్ణ దాస్ ప్రభూజ తెలిపారు. రోడ్డు అభివృద్ధి కోసం తమ ఆశ్రమాన్ని తీసుకున్నారని... ప్రస్తుతం ఆశ్రమవాసులకు గూడు లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వమే ఆశ్రమవాసులకు ఆశ్రయం కల్పించాలని కోరారు.
sఇవీ చదవండి:కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్