పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక వేదికగా వినియోగించాలని... వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ పొరుబిడ్డల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి... అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి...
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తీసుకువచ్చి , సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోదండరాం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎగువ భాగంలో నిర్మించాల్సి ఉన్నప్పటికీ... దిగువకు నిర్మించడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిందని తెలిపారు. లక్షా 7 వేల పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారని... కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదని విమర్శించారు.