ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజాభద్రత విషయంలో లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేసీఆర్ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని... మంత్రులు, అధికారులు ఉత్సవ విగ్రహలేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.7500 భృతి చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎన్నికల గురించి పార్టీలో చర్చించే పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.