తెలంగాణ

telangana

త్వరలోనే నిరంకుశ పాలనకు చరమగీతం: కోదండరాం

మనం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెజస పట్టభద్రుల ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్న కోదండరాం యాదగిరిగుట్టలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

By

Published : Mar 11, 2021, 4:01 AM IST

Published : Mar 11, 2021, 4:01 AM IST

tjs mlc candidate election campaign in yadagiri gutta in yadadri bhuvanagiri district
రాష్ట్రంలో నిరంకుశ పాలనకు చరమగీతం: కోదండరాం

ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని తెజస పట్టభద్రుల ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. తెరాస పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భవనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బైక్​ ర్యాలీ నిర్వహించారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై మిలియన్ మార్చ్​ నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో నంబర్​పై ఓటు వేసి తనను గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ఇదీ చూడండి:గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details