తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస పాలనలోనే అభివృద్ధి సాధ్యం: గాదరి కిశోర్​ - తెలంగాణ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ శంకుస్థాపన చేశారు. అనంతరం గుండెపోటుతో మృతి చెందిన నాగుల నర్సయ్య కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

thungathurthy mla, foundation stone for development works in mothkur
మోత్కూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, తుంగతుర్తి ఎమ్మెల్యే

By

Published : May 6, 2021, 2:38 PM IST

తెరాస పాలనలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 12వ వార్డులో రూ. 5 లక్షల వ్యయంతో మురుగు కాలువ నిర్మాణ పనులు, గాంధీ నగర్​ 7వ వార్డులో డ్రైనేజీ పనులు, పాత బస్టాండ్​ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

మేజర్​ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్ది రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపాలిటీలో ఏవైనా సమస్యలుంటే అధికారులతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆరెగూడెంలో గుండెపోటుతో మృతి చెందిన నాగుల నర్సయ్య(51) కుటుంబానికి రైతుబీమా పథకానికి సంబంధించిన రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

ఇదీ చదవండి:కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు

ABOUT THE AUTHOR

...view details