తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదింటికి సీఎం కేసీఆర్​ పెద్ద దిక్కయ్యారు: ఎమ్మెల్యే గాదరి కిశోర్​ - మోత్కూరు మున్సిపాలిటీని సందర్శించిన తుంగతుర్తి ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ పర్యటించారు. 69 మంది లబ్ధి దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

thungathurthi mla gadari kishore visited mothkur municipality yadadri bhuvanagiri district
పేదింటికి సీఎం కేసీఆర్​ పెద్ద దిక్కయ్యారు: ఎమ్మెల్యే గాదరి కిశోర్​

By

Published : Oct 9, 2020, 4:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్ పర్యటించారు. కాలనీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేవని స్థానికులు తెలపడంతో కాలనీలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజి సౌకర్యం కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

చెక్కుల పంపిణీ..

మండల పరిషత్ కార్యాలయంలో 69 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను కిశోర్​ కుమార్​ అందించారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసి... పేదింటికి పెద్ద దిక్కయ్యారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి, జడ్పీటీసీ గోరుపల్లి శారద తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్​ రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details