కొనుగోలు కేంద్రాలున్నా.. ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలకు కష్టాలు తప్పటం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాణ్యత సాకుతో పంట కొనుగోలుకు నిర్వాహకులు ఆంక్షలు పెడుతోండటంతో వ్యయప్రయాసలకోర్చి రైతులు యంత్రాల సాయంతో ధాన్యాన్ని తూర్పారపడుతున్నారు.
రైతులకు తప్పని ఆంక్షలు - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
నాణ్యత సాకుతో పంట కొనుగోలు నిర్వాహకులు అన్నదాతలపై మరింత భారం వేస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తే నిర్వాహకులు ఆంక్షలు పెడుతోండటంతో.. యంత్రాల సాయంతో ధాన్యాన్ని తూర్పారపడుతున్నారు.
![రైతులకు తప్పని ఆంక్షలు Thresh the grain with the help of CB](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9978457-270-9978457-1608718074923.jpg)
జేసీబీ సహాయంతో ధాన్యాన్ని తూర్పార
నిజానికి కేంద్రాల్లోనే యంత్రాలు ఏర్పాటుచేయాల్సి ఉన్నా వాటిని యాజమాన్యాలు సమకూర్చడం లేదు. చేసేదేెం లేక రైతులు ట్రాక్టర్లకు గాలి పంకలు అమర్చుకొని మరీ తూర్పారపడుతున్నారు. దీనికి గాను గంటకు రూ.800 చొప్పున ఖర్చుచేస్తున్నారు. జిల్లాలోని అడ్డగూడూరు ఐకేపీ కేంద్రంలో ఓ రైతు వినూత్నంగా ట్రాక్టరుకు గాలిమర ఏర్పాటుచేసి జేసీబీ సహాయంతో ధాన్యాన్ని తూర్పార పడుతుండడం దీని తీవ్రతను తెలుయజేస్తోంది.
ఇదీ చూడండి:వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి