యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురంలో దారుణం జరిగింది. పాత కక్షలతో ఓ వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. గ్రామానికి చెందిన బండారి ఉప్పలయ్యపై... నీల వెంకటేశ్ సహా మరో ముగ్గురు కలిసి దాడి చేశారని ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
కొండాపురంలో పాత కక్షలతో వ్యక్తిపై దాడి - కొండాపురంలో వ్యక్తిపై ముగ్గురు దాడి
పాత కక్షలతో ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపురంలో జరిగింది. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
![కొండాపురంలో పాత కక్షలతో వ్యక్తిపై దాడి Three people attacked on a man with old orbits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7648209-thumbnail-3x2-dadi-rk.jpg)
పాత కక్షలతో వ్యక్తిపై ముగ్గురి దాడి
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన ఉప్పలయ్యను చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో చేర్పించి... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!