యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో మూడు కొవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈనెల 2న వైరస్ బారిన పడిన చౌటుప్పల్ కూరగాయల వ్యాపారి కుటుంబంలో మరో ఇద్దరికి (బాధితుడి భార్య, కుమారుడు) పాజిటివ్ నిర్ధరణ అయింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో ముగ్గురికి కరోనా - భువనగిరి జిల్లాలో కరోనా కేసులు
కొంతకాలం కరోనా కేసుల ఊసే లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో వలస నుంచి స్వస్థలాలకు తిరిగి వచ్చిన వారితో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జిల్లాలో మరో మూడు కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
భువనగిరి జిల్లాలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు
భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన యువకుడిలోనూ కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. పోటీ పరీక్షల సన్నద్ధత కోసం దిల్లీ వెళ్లి మే 31న సొంతూరు చేరుకున్న యువకుణ్ని అదే రోజున అధికారులు హోం క్వారంటైన్ చేశారు. వైరస్ లక్షణాలు కనిపించగా జూన్ 4న అతణ్ని బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించి, 5 తేదీన నమూనాలు సేకరించారు. కరోనా నిర్ధరణ పరీక్షలో పాటిజివ్‌గా తేలిందని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
- ఇదీ చూడండి:మహిళల వివాహ వయస్సు పెంపు!