యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు సింహవాహనంపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పాతగుట్టలోని తిరువీధుల్లో వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
సింహవాహనసేవలో యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి - మూడోరోజు ఘనంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
పాతగుట్టలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 22న ప్రారంభమైన వేడుకలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి.

temple
స్వామివారి వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొని వైభవంగా కార్యక్రమం చేపట్టారు. ఈరోజు సాయంత్రం ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు.