తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ... - latest crime news yadadri district

తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. 12 తులాల బంగారం, కిలోన్నర వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

theft in a locked house in yadadri district
ఊరికెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ...

By

Published : Feb 11, 2020, 8:28 AM IST

Updated : Feb 11, 2020, 9:48 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లి కాలనీలో తాళం వేసి ఉన్న బద్దం కృష్ణగౌడ్​ ఇంట్లో చోరీ జరిగింది. తన బావమరిది దశ దినకర్మకని ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని మహబూబ్​పేటకు వెళ్లారు కృష్ణగౌడ్. సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా.. బీరువా తలుపులు తెరిచి, దుస్తులు, వస్తువులు, చిందర వందరగా పడేసి, ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఉన్నాయి.

అనుమానం వచ్చిన కృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. బీరువాలో ఉన్న 12 తులాల బంగారు, కిలోన్నర వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న యాదగిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఊరికెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ...

ఇదీ చూడండి :భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..

Last Updated : Feb 11, 2020, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details