యాదాద్రి నారసింహుని ఆలయంలో దర్శనాలు నిలిపి రెండు నెలలు పూర్తయ్యాయి. జనతా కర్ఫ్యూ అనంతరం లాక్ డౌన్ అమలు కావడం వల్ల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దైవ దర్శనాలు ఆగాయి.
యాదాద్రి ఆలయం మూసి.. రెండు నెలలు పూర్తి.. - యాదాద్రి నారసింహుని ఆలయం
యాదాద్రి ఆలయం మూసి రెండు నెలలు పూర్తైంది. ఇసుకేస్తే రాలనంత మంది వచ్చే పుణ్యక్షేత్రం.. ప్రస్తుతం భక్తులు లేక.. సందడి తగ్గింది. దేశ, విదేశీ యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి.
యాదాద్రి ఆలయం మూసి నేటికీ రెండు నెలలు పూర్తి
మునుపెన్నడూ లేని విధంగా ఆలయంలో భక్తులు లేకుండా ఏకాంత సేవలు సాగుతున్నాయి. నిత్యం సుమారు 18 గంటలు నిత్యారాధనలు, దర్శనాలతో శోభిల్లే దేవదేవుడికి ఏడు గంటలపాటు ఆరాధనలు జరగడం గమనార్హం.
ఇదీ చూడండి:రైతులు నియంత్రిత పద్ధతిలో సాగుకు ముందుకు రావాలి: సీఎం