యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో ఇంటింటికీ తిరిగి చెత్త బండి నడుపుతూ చెత్త తీసుకెళ్లి ఊరు బయట వేశాడో వార్డ్ మెంబర్. తన పని కాకపోయినా గ్రామస్థుల ఇబ్బంది చూసి చెత్త బండి ఎక్కాడు.
సమ్మెలో కార్మికులు.. చెత్త సేకరణలో వార్డు సభ్యుడు
ఇంటింటికీ తిరిగి చెత్త బండి నడుపుతూ చెత్త తీసుకెళ్లి ఊరు బయట వేశాడో వార్డ్ మెంబర్. పారిశుద్ధ్య కార్మికులు పన్నెండు రోజుల నుంచి సమ్మె చేస్తుండగా.. తానే స్వయంగా చెత్తపారవేసి శభాష్ అనిపించుకున్నాడు.
తమ సమస్యలు తీర్చాలంటూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పన్నెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. గ్రామంలోని ఇళ్లల్లో చెత్త పేరుకుపోగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు పట్టించుకోకపోవటంతో.. 8వ వార్డ్ మెంబర్ ఆరె. కృష్ణ రమణమ్మ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వార్డులోని ఇంటింటికీ తిరిగి చెత్త బండి నడుపుతూ చెత్త తీసుకెళ్లి ఊరు బయట వేశారు. పారిశుద్ధ్య కార్మికులు చెత్త తీయక పోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారికి అనారోగ్య పరిస్థితి ఏర్పడకుండా చెత్తను తానే స్వయంగా తీసుకువెళ్లానని అతను తెలిపాడు.