తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ ఇంటి కొచ్చిన కష్టాన్ని... ఆ ఊరంతా పంచుకుంది - ఆర్థిక సాయం చేసిన బీర్ల ఐలయ్య

కష్టాల్లో ఉన్న వారిని చూసి అయ్యో..! అనుకునే వారే ఎక్కువ మంది ఉన్న నేటి సమాజంలో... తోచిన సాయం చేసి వారికి అండగా నిలిచే వారు కొందరు ఉంటారు. అలాంటి కోవలోకే చెందుతారు యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పలపాడు గ్రామస్థులు.

ఆ ఇంటి కొచ్చిన కష్టాన్ని... ఆ ఊరంతా పంచుకుంది
ఆ ఇంటి కొచ్చిన కష్టాన్ని... ఆ ఊరంతా పంచుకుంది

By

Published : Feb 14, 2021, 1:26 PM IST

పంచుకుంటే ఎంత పెద్ద కష్టమైన చిన్నదైపోతుంది. తమ ఊరిలో ఓ కుటుంబానికి వచ్చిన కష్టానికి గ్రామమంతా అండగా నిలిచింది. అందరూ తోచినంత సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పలపాడుకు చెందిన రాగతి భాగ్యమ్మ (45) అనారోగ్యంతో మృతిచెందింది. నిరుపేద కుటుంబమైన వారికి గ్రామస్థులంతా అండగా నిలిచారు. అందరూ చందాలు వేసుకుని రూ.20వేలు తక్షణ సాయం కింద ఆ కుటుంబానికి అందించారు.

విషయం తెలుసుకున్న ఆలేరు కాంగ్రెస్​ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య తన వంతు సాయంగా రూ. 5వేలు అందించారు. కార్యక్రమంలో బత్తిని ఉప్పలయ్య గౌడ్, ఆకుల ముత్యం గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణలో.. ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం

ABOUT THE AUTHOR

...view details