యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట, తుర్కపల్లి మండలాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపుగా కొన్ని వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చేతికి వచ్చిన పంట కళ్లముందే నేలపాలయ్యింది. అది చూసిన రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మామిడితోటలో పండ్లన్నీ రాలిపోయాయి, కూరగాయల పంటలు, సపోటా వివిధ రకాల పంటలు వర్షం దాటికి నిలవలేకపోయాయి.
కడగండ్లు మిగిల్చిన వడగండ్లవాన
వడగండ్ల వాన రైతుల జీవితాల్లో కడగండ్లు మిగిల్చింది. అకాలవర్షం అపార నష్టాల్ని తీసుకొచ్చింది. యాదాద్రి భువనిగిరి జిల్లాలో చేతిదాక వచ్చిన పంట నేలపాలవడం వల్ల రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కడగండ్లు మిగిల్చిన వడగండ్లవాన