లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మాత్రం రోగుల సేవల్లో నిమగ్నమయ్యారు. వైద్య చికిత్స అందిస్తూ పలువురి ప్రశంసలు పొందారు. యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని విభాగాల్లోనూ వైద్యులు, నర్సులు.. అన్ని విభాగాల సిబ్బంది ఐక్యమత్యంగా పనిచేసి కరోనా వైరస్ ను కట్టడి చేశారు. ఈసందర్భంగా మోత్కూరులోని స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిని శాలువాలతో సన్మానించాారు.
ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే డబ్బులు ఖర్చు
కేసీఆర్ పాలనలో.. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం కల్గుతోందని మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రైవేటు ఆసుపత్రులు పనిచేయని సమయంలో ప్రభుత్వ వైద్యసిబ్బంది గ్రామీణ పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కేవలం మే నెలలోనే పది సాధారణ ప్రసవాలను చేసి వారికి సహకరించిన వైద్య సిబ్బందిని అభినందించారు. అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప.. వచ్చిన రోగం నయం కాదన్నారు.