యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి బాటలో నడుస్తోంది. 1977లో ఉమ్మడి నల్గొండలో ఉన్నప్పుడు నాగార్జున గ్రామీణ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఈ సంఘం ఏర్పడింది. 1991 నుంచి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాయంతో ముందుకెళ్లింది. మోత్కూరు మండలంలోని 13 గ్రామాలను దత్తత తీసుకొని సేవలు విస్తృత పరిచింది. ఈ సంఘంలో 11 వేల మంది రైతులు సభ్యులుగా ఉండగా, అందులో 3,035 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు ఏడు పాలక వర్గాలు సంఘం అభివృద్ధికి కృషి చేశాయి. సంఘంలో రెండెకరాల కమర్షియల్ భూమి, సుమారు ఐదు కోట్ల రూపాయల ఆర్థిక వనరులను ఉన్నాయి.
11 సార్లు సందర్శించి అధ్యయనం చేసి
సుమారు 20 లక్షల రూపాయల నష్టంతో వరుస పరాజయాలతో ముందుకు సాగింది. ఆ తరుణంలో ఈ సంఘాన్ని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారు ఆదీనంలోకి తీసుకుని అభివృద్ధి పరచడానికి పాలకవర్గంతో చర్చించి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1995లో మోత్కూరు రైతు సహకార సంఘం(సింగిల్ విండో) ఛైర్మన్గా కంచర్ల రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ముల్కనూరు సొసైటీని 11 సార్లు సందర్శించి అధ్యయనం చేసి మోత్కూరు సంఘం అభివృద్ధికి నాంది పలికారు. అనంతరం సంఘం నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలకు రుణాలు ఇస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.