తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాలు.. మామిడి కష్టాలు - యాదాద్రి భువనగిరిజిల్లా తాజా వార్త

యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు మామిడి రైతులకు నష్టాల్ని మిగిల్చాయి. కోతదశకు వచ్చిన మామిడి కాయలు నేలరాలడం చూసి కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

The mangoes were damaged by sudden rains in Yadadri Bhuvanagiri
అకాల వర్షాలు.. మామిడి కష్టాలు

By

Published : May 7, 2020, 9:28 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలుప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కురిసిన వర్షం మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కోతదశకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి.

మామిడి తోటలోని కాయలు కోతదశకు వచ్చిన తరుణంలో అకాల వర్షాల ధాటికి రాలిపోవడం చూసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న కాయలను మార్కెట్లో అమ్మినా కొనరని వాపోతున్నారు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అకాల వర్షాలు.. మామిడి కష్టాలు

ఇదీచూడండి:విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details