యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జాజిరెడ్డిగూడెం వాగు నుంచి మేడ్చల్ జిల్లా జగదేవపూర్కు ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కుబీరాన్గా పోలీసులు గుర్తించారు.
నిద్రలోనే లారీ డ్రైవర్ మృతి.. కారణం అదేనా? - లారీ డ్రైవర్ మృతి
డ్యూటీ అనంతరం ఇసుక లారీ పక్కకు ఆపి నిద్రించిన డ్రైవర్ తెల్లవారే సరికి మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమెట్ల గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రలోనే లారీ డ్రైవర్ మృతి
రాత్రి మద్యం సేవించి స్పృహ కోల్పోయి చనిపోయాడా? లేదా గుండెపోటుతో ప్రాణాలు వదిలాడా అనేది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చామని ఎస్సై పేర్కొన్నారు.
Last Updated : Jul 11, 2020, 9:31 PM IST