యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సాయిగూడెం, కొల్లూరు, టంగుటూరు, షారాజి పేట గ్రామాలలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.
యాదాద్రి భువనగిరిలో దోపిడి దొంగల బీభత్సం - latest news of robberies
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాలలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు లక్ష రూపాయల నగదు.. నాలుగు తులాల బంగారం దొంగిలించారని పోలీసులు గుర్తించారు.
పోస్ట్ ఆఫీస్, మీ సేవా, మహిళా శ్రీనిధి కేంద్రం, పాల కేంద్రంలతో పాటు తాళం వేసి ఉన్న సుమారు 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. లక్షరూపాయల నగదు, దాదాపుగా 4 తులాల బంగారం అపహరించినట్టు బాధితులు పోలీసులకు తెలిపారు. క్లూస్ టీమ్‌తో పోలీసులు నేరస్తుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆభరణాలు ఇవ్వండి.. లేదంటే చంపేస్తాం'