ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ పంచరూప లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన భక్తులు రద్దీ పెరిగింది. వారాంతపు సెలవులు రావడం... అందులోనూ నేడు ఆదివారం కావడం వల్ల స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది హాజరయ్యారు. స్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆలయ నిర్మాణ పనుల కారణంగా కొండపైకి ప్రైవేట్ వాహనాలను నిరాకరిస్తున్నారు. కొండపైన సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు - The crowds of devotees at Yadadri
వారాంతపు సెలవులు కారణంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు