తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సందడిగా ఆలయ పరిసరాలు - తెలంగాణ శాసనసభ కార్యదర్శి

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటం వల్ల కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున.. అధికారులు వాహనాలను కొండ పైకి అనుమతించడం లేదు

The crowd of devotees to yadadri Sri Lakshmi narasimha Swamy Temple has increased in sunday
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సందడిగా ఆలయ పరిసరాలు

By

Published : Mar 14, 2021, 5:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావటం వల్ల.. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున.. అధికారులు వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. ఆలయ ముఖ మండపంలో జరుగుతోన్న అష్టోత్తర పూజలు, బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలు, కొండ కింద నిర్వహిస్తున్న సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొంటూ.. మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇదీ చదవండి:ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్​గా మారి

ABOUT THE AUTHOR

...view details