సీఎం కేసీఆర్ ఈ నెల 4న యాదాద్రి క్షేత్రసందర్శనకు వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. సీఎం వచ్చేసరికి ఆలయాన్ని సంప్రదాయ హంగులతో రూపొందించేందుకు యాడా పనుల్లో వేగం పెంచింది. మాడవీధుల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్న సీఎం - March 4th kcr visit yadadri temple
ఈ నెల 4న సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్న సీఎం... యాదాద్రిలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త హంగులను గమనించనున్నారు. మాడవీధుల్లో సౌకర్యాల కల్పనకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్న సీఎం
ఆలయ కనుమ దారులను మెరుగుపరిచేందుకు రోడ్లు, భవనాలశాఖ నడుం బిగించింది. పాత కనుమదారి విస్తరణ ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దారి వెంట మినీ పార్కులను ఏర్పాటు చేశారు. కొండపైన ఆలయ సమీపంలో స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. ప్రధానాలయానికి ఉత్తరాన మొక్కలు, పచ్చిక బయళ్లతో ప్రాంగణాన్ని హరితమయం చేస్తున్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కరోనా మొదటి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది