తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిక విద్యుత్​ బిల్లులతో ప్రజలపై భారం : పెద్దిరెడ్డి - High Electricity bills BJP Protest

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై అధిక విద్యుత్​ బిల్లుల వల్ల మరింత భారం పడుతోందని భాజపా రాష్ట్ర కోర్​ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి అన్నారు. అధిక విద్యుత్​ ఛార్జీలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భాజపా నేతలు ఆందోళన చేశారు.

peddi reddy
అధిక విద్యుత్​ బిల్లులతో ప్రజలపై భారం : పెద్దిరెడ్డి

By

Published : Jun 15, 2020, 5:25 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్...​ బ్యాంక్​ లోన్లు, ఇంటి కిరాయిలు కట్టొద్దని ఓ వైపు ప్రజలకు చెబుతూనే... మరోవైపు విద్యుత్ బిల్లుల భారాన్ని మోపారని భాజపా రాష్ట్ర కోర్​ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి ఆరోపించారు. అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా భాజపా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భాజపా నేతలు ఆందోళన చేశారు. స్థానిక విద్యుత్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

3 నెలల విద్యుత్​ బిల్లులు ఒకేసారి వసూలు చేయాలనుకోవడం దుర్మార్గమని పెద్దిరెడ్డి అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని... మిగిలిన వారికి గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎంత వచ్చిందో అంతే వసూలు చేయాలని సూచించారు. బిల్లులు కట్టకుంటే కరెంట్​ కనెక్షన్లు తొలగిస్తామని బెదిరించడం సరికాదని... ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే కేసీఆర్ ఫాంహౌస్​ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి :కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

ABOUT THE AUTHOR

...view details