ఎటు చూసినా ఆధ్యాత్మికత... ఉత్తేజాన్ని కలిగించే శిల్పాలు... ఆలయదేవుడి చరిత్రను చాటే దృశ్యాలతో యాదాద్రి పుణ్యక్షేత్రం మహాదివ్యరూపం దాలుస్తోంది. కృష్ణ శిలలపై చెక్కిన వివిధ రూపాలే గాకుండా, తంజావూరు కళాకారులతో రూపొందించిన శ్రీచెంచులక్ష్మీ నరసింహస్వామి వారి పరిణయోత్సవ దృశ్యo భక్తులను అలరించనుంది.
తంజావూరు కళారూపంలో యాదాద్రీశుల పరిణయోత్సవం - yadadri temple
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తంజావూరు కళాకారులు రూపొందించిన స్వామివారి పరిణయోత్సవ దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. కృష్ణ శిలలపై చెక్కిన వివిధ రూపాలు ఆలయ చారిత్రకతను తెలియజేస్తున్నాయి.
తంజావూరు కళారూపంలో యాదాద్రీశుల పరిణయోత్సవం
సీఎం సూచన మేరకు... గతంలో భద్రపరిచిన స్వామి వారి పరిణయోత్సవ చిత్రపటాన్ని మరింత మెరుగుపరిచారు. ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా... గర్భగుడి మహాద్వారం ఉత్తర దిశలో రాతిగోడపై చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రపటంలో శ్రీస్వామి, అమ్మవార్ల పరిణయోత్సవంలో మహాశివుడు, విశ్వకర్మ బ్రహ్మ దంపతులతో పాటు మహాముని, నారద మహర్షి పాల్గొన్నట్లు తీర్చిదిద్దారు.
- ఇదీ చూడండి :మహిళల భద్రత కోసం దిశ వాహనాలు ప్రారంభం