యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ వస్త్ర వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ప్రజలను నమ్మించి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. నెల రోజులుగా దుకాణం తెరవకపోగా... ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావటం వల్ల మోసపోయామని గ్రహించిన బాధితులు దుకాణం ముందు ఆందోళనకు దిగారు.
తమిళనాడులోని పోచంపల్లికి చెందిన ఫళని రామస్వామి అనే వ్యక్తి 22 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టకు వలస వచ్చాడు. చందన సెలెక్షన్స్ పేరుతో దుకాణం పెట్టి వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. డబ్బులు తీసుకొని అధిక వడ్డీ చెల్లిస్తున్నాడని స్థానికులు నమ్మి అప్పులు ఇచ్చారు. చెప్పిన సమయానికి ఇస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు.