గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చిన విధంగానే లోక్ సభ పోరులో కూడా సహకరిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకటించింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో సికింద్రాబాద్, నాగర్ కర్నూల్ లో మాత్రం మద్దతు ఇవ్వబోమన్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మాదిగ వర్గానికి అండగా నిలిచినందున ఆయనకు సహకారం అందిస్తామన్నారు. నాగర్ కర్నూల్లో నంది ఎల్లయ్యకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా అక్కడ మిగతా పార్టీలకు ఎమ్మార్పీఎస్ తోడ్పాటుఉంటుందని మందకృష్ణ మాదిగ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాదిగ వర్గీకరణ జరుగుతుందనే నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించామని స్పష్టం చేశారు.
15స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు: మందకృష్ణ మాదిగ - manda krishna
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. నాగర్ కర్నూలు, సికింద్రాబాద్లో మినహా మిగతా 15స్థానాల్లో సంపూర్ణ తోడ్పాటు అందిస్తామన్నారు. భువనగిరిలో ఆ సంస్థ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటన చేశారు.
మందకృష్ణ మాదిగ