ప్యాక్స్ ఛైర్మన్ ఛాంబర్‌ను ప్రారంభించిన గొంగిడి మహేందర్ రెడ్డి - pacs
ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఛైర్మన్ ఛాంబర్‌ను ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
![ప్యాక్స్ ఛైర్మన్ ఛాంబర్‌ను ప్రారంభించిన గొంగిడి మహేందర్ రెడ్డి tescab vice chaiman inaugurated pacs chairman chamber at aleru in yadadri bhuvangiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8510380-387-8510380-1598029588725.jpg)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఛైర్మన్ ఛాంబర్‌ను ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఆలేరు రైతాంగo రుణం తీర్చుకోనే అవకాశం వచ్చిందని... ఈ ప్రాంత రైతులకు 17 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మొగలగాని మల్లేశం గౌడ్, జిల్లా డీసీవో తంగళ్లపల్లి వెంకటరెడ్డి , ఉపాధ్యక్షులు చింతకింది చంద్రకళ, డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి, ఆరె మల్లేశం, తెరాస మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం ఖరారు చేసిన జేఎన్టీయూహెచ్