తెలంగాణ

telangana

ETV Bharat / state

గోపాల్ చెరువులో ఘనంగా గంగపుత్రుల గంగ తెప్పోత్సవం - gangamama bonalu

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని గోపాల్ చెరువులో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి.. ఘనంగా గంగ తెప్పోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి.. మండలంలోని చెరువులన్ని నిండి అలుగులు పారడం పట్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని గంగపుత్రులు స్థానిక గోపాల్ చెరువులో గంగ తెప్పోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

గోపాల్ చెరువులో ఘనంగా గంగపుత్రుల గంగ తెప్పోత్సవం
గోపాల్ చెరువులో ఘనంగా గంగపుత్రుల గంగ తెప్పోత్సవం

By

Published : Sep 29, 2020, 6:38 PM IST

Updated : Sep 30, 2020, 1:40 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని గోపాల్​ చెరువులో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ తెప్పోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కులస్థులు, గ్రామస్తులు, రైతుల కోలాహలంతో డప్పు చప్పుళ్లతో సాంప్రదాయబద్ధంగా నాలుగైదు గంటలపాటు గ్రామంలో గంగతెప్పను ఊరేగించారు.

మహిళల ప్రత్యేక పూజలు..

తెప్పపీఠకు మహిళలు ప్రత్యేక స్వాగతం పలికి, పూజలు నిర్వహించారు. తెప్పపీఠను తలపై పెట్టుకుని బోనాలతో, చెరువు ఆవరణలోని కట్ట మైసమ్మకు నైవేద్యం, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఊరు పచ్చగా ఉండాలని..

గంగపుత్రులు, గ్రామస్థులు సామూహికంగా చెరువులోకి దిగి, తెప్పపీఠను నీటిపై వదిలి, కలకాలం ఊరు పచ్చగా ఉండాలని, వానలు కురిసి చెరువులన్నీ నిండాలని మొక్కుకున్నారు. అనంతరం దీపాలను నీటిపై వదిలి ప్రార్థించారు.

ఏటా గంగ తెప్పోత్సవం..

సంఘం ఆధ్వర్యంలో ఏటా తమ కుల దైవం పవిత్ర గంగమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తామని అధ్యక్షుడు, మండల రైతు సమన్వయ సమితి ప్రెసిడెంట్ గౌటి లక్ష్మణ్ బెస్త వెల్లడించారు. గంగమ్మ బొనాలను విజయవంతం చేసిన కులస్థులు, గ్రామస్థులకు, రైతులకు లక్ష్మణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెప్పోత్సవంతో శాంతి సామరస్యం..

గంగ తెప్పోత్సవంతో గ్రామంలో శాంతి వెల్లివిరుస్తుందని రాజాపేట సర్పంచ్ ఈశ్వరమ్మ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఈ ఉత్సవ నిర్వహకులకు, సంఘానికి సర్పంచ్ అభినందనలు తెలియజేశారు. గంగ తెప్పోత్సవం గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిందని సర్పంచ్ స్పష్టం చేశారు.

గంగమ్మ చెంతనే అన్నదానం..

అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని చెరువులు నిండి అలుగులు పారుతుండటం చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక నాాయకుడు ఆడేపు శ్రీశైలం, మండల కాంగ్రెస్ నాయకులు, రైతు సంఘం నేతలు, ఇతర గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

గోపాల్ చెరువులో ఘనంగా గంగపుత్రుల గంగ తెప్పోత్సవం

ఇదీ చూడండి:వానలు సమృద్ధిగా కురిసినా.. వేసవి వస్తే దాహం కేకలు..

Last Updated : Sep 30, 2020, 1:40 AM IST

ABOUT THE AUTHOR

...view details