తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Temple news: స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రీశునికి శతఘటాభిషేకం

Yadadri Temple news: నారసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో నారసింహుని క్షేత్రం మార్మోగింది.

yadadri pujalu
యాదాద్రి పూజలు

By

Published : Dec 29, 2021, 5:24 PM IST

Yadadri Temple news: నేడు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.

యాదాద్రి పూజలు

శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ.. పాలు, పెరుగుతో నారసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా యాదాద్రీశుని సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

యాదాద్రీశుని సన్నిధిలో భక్తుల రద్దీ

ఇదీ చదవండి:Teacher Transfers in Telangana: టీచర్ల అప్పీళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details