తెరాస హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని లింకురోడ్లకు మహర్దశ కలిగిందని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేల్ అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నుంచి మంజూరైన రూ.10లక్షలతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం ధర్మారం నుంచి గట్టుసింగారం వరకు గల లింకురోడ్డు పనులను గురువారం ఛైర్మన్ ప్రారంభించారు.
'తెరాసతోనే గ్రామాలకు లింకురోడ్లు'
తెరాస హయాంలోనే గ్రామాల్లో లింకురోడ్లకు మహర్దశ కలిగిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేల్ అన్నారు. తమ సంస్థ నుంచి మంజూరైన రూ.10 లక్షలతో పనులు ప్రారంభించారు.
వర్షాకాలంలో ఈ ప్రాంత రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారని ఛైర్మన్ గుర్తుచేశారు. వారు పడుతున్న ఇబ్బందులను గుర్తెరిగి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా ప్రత్యేక నిధులతో ధర్మారం నుంచి గట్టుసింగారం రూ. 10 లక్షలు, ధర్మారం నుంచి కోటమర్తి లింకురోడ్డుకు రూ.5 లక్షలు, ధర్మారం గ్రామంలో రూ. 13లక్షలతో సీసీరోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతులు సహకరించి మంజూరైన మట్టిరోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ చిగుళ్ల ఉపేంద్ర, గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మణాచారి, ఉపసర్పంచ్ ఎల్లయ్య, రైతులు నాగరాజు, వెంకన్న, కిష్టయ్య పాల్గొన్నారు.
- ఇదీ చదవండికరోనా వేళ.. వినూత్న పెళ్లి పత్రిక ఇలా..