యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
యాదాద్రి చుట్టూ ఉన్న రాయగిరి చెరువు, బస్వాపురం ప్రాజెక్టు, పెద్దగుట్ట (టెంపుల్ సిటీ) పైన పార్కులు, కొలనుపాక జైన్మందిర్ వంటి ప్రాంతాలను సందరీకరిస్తామని తెలిపారు. హోటళ్లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటుచేస్తామన్నారు.