కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి
కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి - కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద తెతెదేపా నేతలు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో అంజలి ఘటించారు.
![కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4465453-673-4465453-1568702941427.jpg)
కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చేరుకున్న సమయంలో పురపాలిక కేంద్రం వద్ద తెతెదేపా నేతలు, కార్యకర్తలు కోడెలకు నివాళులు అర్పించారు. జోహార్ కోడెల జోహార్ అంటూ నినాదాలు చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కార్యకర్తలకు అభివాదం చేశారు.
- ఇదీ చూడండి : కక్ష కట్టి... క్షోభ పెట్టి కడతేర్చారు: చంద్రబాబు