యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తెలంగాణ మణిహారమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంతోపాటు దేశంలోని భక్తుల కోసం సీఎం కేసీఆర్ దీన్ని అద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.
Yadadri : తెలంగాణకు మకుటాయమానం.. యాదాద్రి ఆలయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాశక్తికి అద్భుత నిదర్శనం ఈ క్షేత్రమని ట్వీట్ చేశారు.
యాదాద్రి టెంపుల్, యాదాద్రి ఆలయం
ముఖ్యమంత్రి దృష్టికి, ఆలోచనాశక్తికి ఈ క్షేత్రం నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. మరిన్ని అద్భుత చిత్రాలను, ఆలయ విశేషాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.