తెలంగాణ

telangana

ETV Bharat / state

CJ IN YADADRI: యాదాద్రీశుడి సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ - తెలంగాణ వార్తలు

యాదాద్రీశుడి సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు.

CJ IN YADADRI, yadadri temple
యాదాద్రిలో సీజేఐ, శ్రీలక్ష్మి నరసింహ స్వామి

By

Published : Jul 4, 2021, 6:52 PM IST

హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ కుటుంబసమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. సీజేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి ప్రత్యేక పూజలు చేశారు. సీజేకు ఆలయ ఆర్చకులు, ఈవో గీతారెడ్డి లడ్డూప్రసాదం అందించారు.

ప్రత్యేక పూజల్లో హిమా కోహ్లి

కలియతిరిగిన సీజే

స్వామివారి దర్శనం తర్వాత యాదాద్రిలో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనుల్ని జస్టిస్‌ హిమా కోహ్లీ తిలకించారు. ప్రధాన ఆలయంలోని మాడవీధుల్లో అరగంటపాటు కలియతిరిగిన సీజే... శిల్పాలను పరిశీలించారు. పునర్నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సీజేకు ఘన స్వాగతం

కాసేపు ఇబ్బందులు

సీజే పర్యటన దృష్ట్యా సుమారు ఒక అరగంట పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. కొండ పైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. భక్తులు కాలినడకన కొండపైకి చేరుకొని కాస్త ఇబ్బందులు పడ్డారు. చీఫ్ జస్టిస్​తో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఆదివారం సందడి

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నారసింహుని నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అష్టోత్తరం వంటి పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చదవండి:yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సందడిగా ఆలయ పరిసరాలు

ABOUT THE AUTHOR

...view details