తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవో నంబర్‌ 6ను వెంటనే ఉపసంహరించుకోవాలి: గంగపుత్ర సంఘం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన జీవో నంబర్‌ 6ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్.మల్లయ్య బెస్త డిమాండ్ చేశారు. ఈ మేరకు భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

telangana gangaputra community demand for g o No.6 should be withdrawn immediately
జీవో నంబర్‌ 6ను వెంటనే ఉపసంహరించుకోవాలి: గంగపుత్ర సంఘం

By

Published : Feb 7, 2021, 12:21 PM IST

Updated : Feb 7, 2021, 10:54 PM IST

గంగపుత్రుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్.మల్లయ్య బెస్త అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రుల హక్కులను కాలరాస్తోందని భువనగరి మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు పూస శ్రీనివాస్ బెస్త అన్నారు. కులాలు, మతాలకు చిచ్చుపెట్టి వారి జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జీవో నంబర్ 6ను వెంటనే రద్దు చేసి.. ఆ స్థానంలో గతంలో ఉన్న జీవో నంబర్​ 74ను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షులు జి.లక్ష్మణ్ బెస్త, పబ్బు నారాయణ బెస్త, చింతల కృష్ణ బెస్త తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Last Updated : Feb 7, 2021, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details